Manchu Vishnu: 'కన్నప్ప' సినిమానే కాదు-జీవిత ప్రయాణం.. 1 y ago

featured-image

“నాకు 'కన్నప్ప' కేవలం సినిమానే కాదు... నా జీవితంలో అతి ముఖ్యమైన ప్రయాణం. అచంచలమైన విశ్వాసం, త్యాగానికి సంబంధించిన ఈ కథతో నాకు ఆథ్యాత్మిక బంధం ఏర్పడింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది దిగ్గజ నటులు మాతో కలవడం గర్వంగా ఉంది” అని విష్ణు మంచు అన్నారు . ఆయన ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబయిలో టీజర్ ప్రదర్శన కార్యక్రమంలో కథానాయకుడు అక్షయ్కుమార్ మాట్లాడుతూ “చాలా శక్తిమంతమైన కథ ఇది. ఈ అవకాశం నా దగ్గరికి వచ్చినప్పుడు రెండుసార్లు తిరస్కరించాను. కానీ శివుడిగా నేను బాగుంటానని విష్ణు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమాని నేను ఒప్పుకునేలా చేసింది" అన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD